ఇద్దరికి గాయాలు
కొయ్యూరు: మండలంలోని డౌనూరు పంచాయతీ పరిధిలోని తురబాలగెడ్డ దాటిన తర్వాత ఉన్న మలుపు వద్ద ఆదివారం సాయంత్రం కూరగాయల వ్యాన్ బోల్తాపడింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నర్సీపట్నం నుంచి ఒడిశా ప్రాంతానికి కూరగాయలను తరలిస్తున్న వ్యాన్ తురబాలగెడ్డ దాటిన అనంతరం మలుపు వద్దకు చేరుకోగానే బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వ్యాన్‌లోని కూరగాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.


