పాడేరు రూరల్: నూతనంగా ఎన్నికై న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వంతాల శాంతి, వైస్ చైర్మన్ సీదరి రాంబాబులను వివిధ మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు ఆదివారం పాడేరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికై న చైర్‌పర్సన్ వంతాల శాంతి, వైస్ చైర్మన్ సీదరి రాంబాబులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మజ్జి సుబ్బలక్ష్మి, మాజీ ఎంపీపీ సీతమ్మ, పార్టీ సీనియర్ నాయకులు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.


