నర్సీపట్నం : కార్తీక మాసం పురస్కరించుకుని పంచారామాల దర్శనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును డిపో మేనేజర్ పి.ఆచారి ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్ధం పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు, పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీ లభిస్తుందన్నారు. తక్కువ ధరకు పంచారామాలకు బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అసిస్టెంట్ మేనేజర్ డి.త్రిమూర్తులు, డిప్యూటీ సూపరింటెండెంట్ మోహన్రావు పాల్గొన్నారు.


