వైఎస్సార్‌సీపీ విజయం.. జగనన్నకు గిఫ్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయం.. జగనన్నకు గిఫ్ట్‌

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

సాక్షి, పాడేరు: జిల్లాలో ఏడు జెడ్పీటీసీ, 88 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుచుకోవడం సంతోషంగా ఉందని అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గిఫ్ట్‌గా అందిస్తున్నామన్నారు. హుకుంపేట జెడ్పీటీసీగా విజయం సాధించిన ఒంటుబు ప్రియాంక సోమవారం అరకు ఎంపీ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీఈసీ సభ్యుడు చెట్టి పాల్గుణ, యువజన విభాగం రాష్ట్ర నేత చెట్టి వినయ్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రియాంకను సన్మానించి, అభినందించారు. ఎంపీ మాట్లాడుతూ గిరిజనులంతా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరోసారి ఈ విషయాన్ని నిరూపించాయన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో తొలి జెడ్పీ చైర్మన్‌ పదవితో పాటు పలు మండలాల్లో ఎంపీపీ పదవులను కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గంపరాయి దిలీప్‌కుమార్‌, ఒంటు బు శామ్యూల్‌, కోటిబాబు, పద్మనాభం పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో

ప్రజలు పార్టీకి పట్టం కట్టారు

ఏడు జెడ్పీటీసీ,

88 ఎంపీటీసీ స్థానాల్లో విజయం

అరకు ఎంపీ డాక్టర్‌ తనూజరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement