కేంద్రాలు
సాక్షి, పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో చివరి ఘట్టమైన గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో మన్యంలో మరోసారి పంచాయతీ ఎన్నికల సందడి నెలకొననుంది. ఎన్నికల కోడ్ కూడా జిల్లాలో అమల్లో ఉంది.
244 పంచాయతీల్లో ఎన్నికలు
జిల్లాలోని 244 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మండలాల వారీగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని మండలాల వారీగా పంచాయతీలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
మండలం పంచాయతీలు వార్డులు పోలింగ్
అరకు నియోజకవర్గం
అరకులోయ 14 164 164
అనంతగిరి 24 232 232
డుంబ్రిగుడ 18 188 188
పెదబయలు 23 232 232
హుకుంపేట 33 282 282
ముంచంగిపుట్టు 23 228 228
పాడేరు నియోజకవర్గం
పాడేరు 26 246 246
చింతపల్లి 17 204 204
జి.మాడుగుల 17 188 188
కొయ్యూరు 33 294 294
జి.కె.వీధి 16 188 188
మొత్తం 244 2446 2446
జిల్లాలో 244 పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు
మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు
నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్


