కొయ్యూరు: జావెలిన్ త్రో అండర్–17 విభా గంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థి కుర్తాడి లింగమూర్తి బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఈ విజయంతో ఈ నెల 12 నుంచి 16 వరకు మధ్యప్రదేశ్లో జరిగే 74వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. ఈ సంద ర్భంగా సోమవారం కొయ్యూరు ఆశ్రమ బాలుర పాఠశాల–1 హెచ్ఎం శ్రీనివాస్, పీడీ శివప్రసాద్, వార్డెన్ అంబటి నూకరాజు, ఇతర ఉపాధ్యాయులు.. లింగమూర్తిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షించారు.


