మన్యంలో మొదలైన చలిగాలులు | - | Sakshi
Sakshi News home page

మన్యంలో మొదలైన చలిగాలులు

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

● పడిపోతున్న ఉష్ణోగ్రతలు ● మినుములూరులో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

● పడిపోతున్న ఉష్ణోగ్రతలు ● మినుములూరులో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

సాక్షి, పాడేరు: శీతాకాలం ప్రారంభం కావడంతో మన్యంలో చలిగాలులు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పాడేరు మండలం మినుములూరులోని కేంద్ర కాఫీ బోర్డు వద్ద ఆదివారం, సోమవారం 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఎస్‌ఎల్‌వో రమేష్‌ తెలిపారు. సాయంత్రం నుంచే చలిగాలుల తీవ్రత పెరుగుతుండగా.. అర్ధరాత్రి నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల వరకు పొగమంచు తెరలు వీడటం లేదు. శీతాకాలం ఆరంభంలోనే చలి తీవ్రత పెరగడంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement