శ్రీ ప్రకాష్‌లో రిమ్‌ జిమ్‌ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

శ్రీ ప్రకాష్‌లో రిమ్‌ జిమ్‌ వేడుకలు

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

పాయకరావుపేట: శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్థల్లో రిమ్‌ జిమ్‌–2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్‌ విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఈ వేడుకల్లో తుని, పాయకరావుపేట, అన్నవరం శాఖలకు చెందిన సుమారు 5,800 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. సాహిత్యం, సంగీతం, ఆటలు, క్రీడలు, లలిత కళలు, థియేటర్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ తదితర అంశాల్లో జూనియర్‌, సబ్‌ జూనియర్‌, సీనియర్‌, సూపర్‌ సీనియర్‌ విభాగాలుగా మొత్తం 31 రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల 14న జరిగే ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌. మూర్తి, ప్రోగ్రాం కన్వీనర్‌ గౌతమి, అకడమిక్‌ ఇన్‌చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement