టీడీపీ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ పాగా | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ పాగా

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

బుచ్చెయ్యపేట: మండలంలోని మల్లాం సెగ్మెంట్‌లో టీడీపీ కంచుకోటకు ఎట్టకేలకు బీటలు పడ్డాయి. ఈ సారి స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పల్లా వెంకటలక్ష్మి ఘన విజయం సాధించారు. ఇక్కడ 25 ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా, ఈ ధపా ఎన్నికల్లో మల్లాం సెగ్మెంట్‌ పరిధి ఆర్‌. భీమవరం, ఆర్‌. శివరాంపురం, చిన భీమవరం, ఎంబీపాలెం, చిన మల్లాం, పెద మల్లాం, గంగాదేవిపేట, అప్పంపాలెం గ్రామాల వైఎస్సార్‌సీపీ నాయకుల సమష్టి కృషితో టీడీపీ ఓటమి పాలైంది. ప్రత్యర్థిపై 199 ఓట్లు ఆధిక్యంతో తొలిసారి మల్లాం సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ పాగా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement