రూ.5 లక్షల ఆస్తి నష్టం
మాడుగుల: మండలంలో గాదిరాయిలో సోమవారం ఎల్పీజీ సిలిండర్ పేలిపోవడంతో పూరిల్లు దగ్ధమైంది. రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామస్తులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పర్రే సత్తిబాబు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో రెండు తులాలు బంగారం, 20 తులాలు వెండి, ఇంట్లో దినుసులు, వంట సామాన్లు, దుస్తులు, విలువైన పత్రాలు సహా కాలి బూడిదయ్యాయి. దీంతో సత్తిబాబు కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. సమాచారం మేరకు మాడుగుల అగ్నిమాపక సిబ్బంది శకటంతో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి పూరిల్లు కాలిపోయింది. పర్రే రామోజీ 25 కిలోల బియ్యంతో పాటు 3 కిలోల వంటనూనె, ఇతర సరుకులు బాధిత కుటుంబానికి అందజేశారు.


