సందడిగా ఆకాశదీపోత్సవం | - | Sakshi
Sakshi News home page

సందడిగా ఆకాశదీపోత్సవం

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

చోడవరం: పవిత్ర కార్తీక మాసం పూజలు సోమవారం అన్ని శివాలయాల్లో భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నెలరోజుల పాటు జరిగే ఈ పవిత్ర పూజల్లో మహిళా భక్తులు పెద్దసంఖ్య ఆలయాలకు వచ్చారు. అతిప్రాచీన దేవాలయమైన చోడవరం శ్రీ స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం ఉదయం నుంచీ భక్తులతో రద్దీగా మారింది. మూడు నదులు కలిసి ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. గోవాడ, గవరవరం, జుత్తాడ శివాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సాయంత్రం అన్ని శివాలయాల్లోనూ ఆకాశ దీపోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో శివన్మామస్మరణతో క్షైవ క్షేత్రాలన్నీ మారుమ్రోగాయి. ఈ సందర్భంగా చోడవరం శ్రీ స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయంలో ఆకాశదీపోత్సవం కన్నుల పండువగా జరిగింది.ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రోచ్ఛరణ మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌ రాజు పాల్గొన్నారు. దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కిరణ్మయి, జెడ్పీటీసీ కనిశెట్టి మత్స్యరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గూనూరు సురేష్‌, ఎంపీటీసీ గూనూరు మల్లునాయుడు, మాజీ ఎంపీపీ గూనూరు పెదబాబు పాల్గొన్నారు.

అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయంలో కార్తీకమాసం పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ఆకాశదీపంతోపాటు అఖండ దీపాన్ని సోమవారం రాత్రి ఆలయ సహాయ కమిషనర్‌ బుద్ద లక్ష్మీనగేష్‌, ఉద్యోగులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement