కారును ఢీకొన్న టిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న టిప్పర్‌

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

● ఇద్దరు యువకులు మృతి ● నుజ్జయిన కారు ● పెద బొడ్డేపల్లి వద్ద విషాదం

నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల సమీపంలో ఈ నెల 8వ తేదీ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న కారును టిప్పర్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యవకులు మృతి చెందారు. ఈ ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జుయింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ఎస్‌.కె.గపూర్‌ ఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్‌ ముందు భాగంలో ఇరుకున్న కారును క్రెయిన్‌తో బయటకు తీయించారు. కారులో ఇరుకున్న మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టౌన్‌ సీఐ తెలిపిన వివరాలు ప్రకారం మున్సిపాలిటీ 40వ వార్డు అయ్యన్న కాలనీకి చెందిన ఎం.వి.దుర్గాప్రసాద్‌(23), పి.వంశీ ఇద్దరూ కారులో విశాఖపట్నం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న దుర్గాప్రసాద్‌, వంశీ మృతి చెందారు. దీంతో అయ్యన్న కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి అందించిన కుమారులు అకాల మరణం పొందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘనంగా వీరి అంత్యక్రియులు నిర్వహించారు. తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement