నేటి నుంచి దారమఠంలో కార్తీకమాస పూజలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దారమఠంలో కార్తీకమాస పూజలు

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

గొలుగొండ: ప్రముఖ శైవక్షేత్రమైన దారమఠం శివాలయంలో మంగళవారం వేకువజాము నుంచి కార్తీక మాస పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతం నడుమ వెలసిన దేవాలయం వందల ఏళ్ల నుంచి అలరారుతోంది. నెల రోజుల పాటు భక్తులు వేలాదిగా తరలిరానున్న దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గొలుగొండ నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో శివాలయం ఉంది. కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి మూడు రోజులు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి పొందింది. దారమఠం శివాయం మహా పర్వతం దారకొండ దిగువున ఉంది. ఇక్కడ దట్టమైన అరణ్యంలో పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుంచి జలపాతాలు పొంగి ప్రవహిస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కార్తీక మాసం కావడంతో అటు భక్తులు, ఇటు పర్యాటకులు అధికంగా రానుండటంతో నెల రోజుల పాటు కళకళలాడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement