● వైఎస్సార్‌సీపీ శరభన్నపాలెంఎంపీటీసీ అభ్యర్థి కూడా రాజేశ్వరి
కొయ్యూరు: ఒక్క ఓటు.. అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించింది. మండలంలోని శరభన్నపాలెం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కూడ రాజేశ్వరి ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించడం సంచలనం సృష్టించింది. తొలుత ఈ సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓడిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే, కౌంటింగ్ పూర్తయ్యాక రెండు ఓట్ల మెజారిటీతో రాజేశ్వరి విజయం సాధించినట్లు ప్రకటించారు. దీనిపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసి పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజేశ్వరి ఒక్క ఓటు మెజారిటీతో సమీప ప్రత్యర్థి గాం రమాదేవిపై గెలుపొందారు. రాజేశ్వరికి 872 ఓట్లు రాగా, రమాదేవికి 871 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఒక్క ఓటు ఆధిక్యంతో రాజేశ్వరి విజయం ఖరారైంది.


