లెక్కింపు ప్రక్రియ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

లెక్కింపు ప్రక్రియ పరిశీలన

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

చింతపల్లి: స్థానిక గురుకుల జూనియర్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏఎస్పీ మహేంద్ర సిన్హా పరిశీలించారు. కౌంటింగ్‌ తీరును పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఎస్పీ సూచించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారి రమణారావు, ఎంపీడీవో సీతయ్య, డిప్యూటీ ఎంపీడీవోలు సీతామహాలక్ష్మి, సీఐ సింహాచలం, ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement