అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు సహస్ర నామార్చన పూజ చేశారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి, 1001 నామాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు, తదితర ఘట్టాలతో కల్యాణం శాస్త్రోక్తంగా సాగింది. ఉభయదాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement