● కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 4,98,465 మంది ఓటర్లకు గాను 3,09,133 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 62.01 శాతం పోలింగ్ నమోదైందన్నారు. అత్యధికంగా డుంబ్రిగుడలో 73.63 శాతం, అత్యల్పంగా చింతపల్లిలో 52.25 శాతం పోలింగ్ నమోదైందన్నారు. జిల్లాలో 3,086 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయని, వీటిలో 2,205 మంది పురుషులు, 881 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులు, సిబ్బంది, వివిధ శాఖలతో పాటు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7న 11 మండలాల్లో జరిగే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ నాగ వెంకట సాహిత్, డీఆర్డీఏ పీడీ జయకృష్ణ పాల్గొన్నారు.


