ఆసుపత్రిలో సదుపాయాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో సదుపాయాల పరిశీలన

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్‌సీని గురువారం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌రావు, రాష్ట్ర టీకాల కార్యక్రమ అధికారి డాక్టర్‌ దేవితో పాటు రాష్ట్ర రివ్యూ మిషన్‌ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గర్భిణుల ప్రసవాలు, ల్యాబ్‌ పరీక్షలు, నమోదవుతున్న వ్యాధులు, మందుల నిల్వల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎన్‌సీయూను సందర్శించి బాలింతలు, నవజాత శిశువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, చిన్నారులకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించాలని, వార్డులను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని వైద్యులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, ఏడీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ బాల మురళీకృష్ణ, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ టి.ఎన్‌.ప్రతాప్‌, సూపరింటెండెంట్‌ ధరణి, వైద్యులు ఆదిత్య, ప్రదీప్‌ పాల్గొన్నారు.

సీహెచ్‌సీలో రాష్ట్ర బృందం తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement