ప్లాస్టిక్‌ వాడకానికి స్వస్తి పలకండి | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వాడకానికి స్వస్తి పలకండి

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

● డిపో మేనేజర్‌ ఆచారి పిలుపు

నర్సీపట్నం:ప్లాస్టిక్‌ వాడకం మానవ మనుగడకు ప్రమాదమని ఆర్టీసీ డిపో మేనేజర్‌ పాలుమూరి ఆచారి తెలిపారు. గురువారం నిర్వహించిన ప్లాస్టిక్‌కు నో చెబుదాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్‌ వాడకానికి స్వస్తి పలకాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ అత్యంత ప్రమాదకరమన్నారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వల్ల భూగర్భ జలాలు కలుషితమవడంతోపాటు అడుగంటి పోతాయన్నారు. ప్లాస్టిక్‌ వస్తువుల్లో వేడి ఆహార పదార్థాలు కరిగి మానవ శరీరంలో ప్రవేశించి క్యాన్సర్‌ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ డి.టి.త్రిమూర్తులు, డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎంఎన్‌.రావు, పి.వి.రమణ, కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement