ఓటువేసేందుకు వచ్చిన పెళ్లికుమార్తె చంద్రిక
నక్కపల్లి : పెళ్లిపీటల మీద నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న సంఘటన మండలంలో గురువారం జరిగింది. గొడిచర్ల కొత్తూరు గ్రామానికి చెందిన మంతిన చంద్రికకు గురువారం ఉదయం కశింకోటలో వివాహం జరిగింది. తన గ్రామంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె పెళ్లి తంతు పూర్తయిన వెంటనే గొడిచర్లలో పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకుంది.


