బుచ్చెయ్యపేట: మండలంలోని బంగారుమెట్టలో చూడి ఆవు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన పర్రే పెద వెంకినాయుడుకు గురువారం సాయంత్రం తన ఆవును మేతకు తోలుకెళ్లాడు. ఈ క్రమంలో గట్టుపై నుంచి జారి చెరువులో పడి పోయింది. ఆవు మెడ విరిగిపోయి నీటిలో మునిగి చనిపోయింది. స్థానికులు తాళ్లు సహాయంతో చెరువులో నుంచి బయటకు తీశారు. ఐదు నెలల చూడి ఆవు చనిపోవడంతో రూ. 60 వేలు నష్టం జరిగిందని బాధిత రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం పరిహారం అందించాలని పలువురు కోరారు. నాయకులు యెనుముల వాసు, హణికంఠ, సాయం వెంకటేష్ తదితరులు పరామర్శించారు.


