పోలీసు వాహనాలే ప్రమాదాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పోలీసు వాహనాలే ప్రమాదాలకు ఆహ్వానం

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

కాలం చెల్లిన వాహనంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ జీపు

అనకాపల్లి టౌన్‌: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌ వాహనాలే ప్రమాదాలకు ఆహ్వనం పలుకుతున్నాయి. ఎక్కడైనా ప్రమాదం, దొంగతనాలు జరిగితే తక్షణమే హాజరు కావల్సిన పోలీసులు తుప్పుపట్టిన జీపులో విధులు నిర్వహిస్తుండంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లినట్లుగా కనిపిస్తున్న ఓ పోలీస్‌ జీపు ఎన్నికల విధుల్లో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీస్‌ విధుల్లో నిత్యం గస్తీ నిర్వహించాల్సిన ఈ జీపు పరిస్థితి చూస్తే వాహన నిర్వహణపై అనేక ప్రశ్నలు తల్తెత్తుతున్నాయి. జీపు పూర్తిగా తుప్పుపట్టి ఉంది. అలాగే నెంబర్‌ ప్లేట్‌ సరిగ్గా కనిపించడం లేదు. రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహించే సమయంలో ఇటుంటి వాహనాలతో ఇతర వాహనాదారులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రోడ్లపై తరిగే ప్రతి వాహనానికి ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ సిగ్నల్‌ లైట్లు తప్పనిసరిగా ఉండాలని రవాణా శాఖ నిబంధనలు చెపుతున్నాయి. నిబంధనలు ఉల్లఘించే సామాన్యులకు విధించే జరిమానాలు పోలీస్‌ వాహనాలకు విధిస్తున్నారా లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తక్షణమే పోలీస్‌ శాఖకు ప్రతిష్టకు సంబంఽధించిన అశంగా భావించి సంబంధిత ఉన్నతాధికారలు ఈ వాహనంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement