పోలింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లు

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

● బ్యాలెట్‌ పత్రాల ముద్రలతో బయటకొస్తున్న ఫొటోలు ● నిబంధనల ఉల్లంఘనపై ఓటర్ల అనుమానాలు

బ్యాలెట్‌ పేపర్‌పై సిరా గుర్తుతో వైరల్‌ అవుతున్న ఫొటోలు

తుమ్మపాల : జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌కు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్లు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, అనకాపల్లి మండలంలో జరిగిన పోలింగ్‌లో కొందరు మొబైల్‌ఫోన్లతో పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాము ఓటు వేసిన దృశ్యాలతో పాటు, ఓటు హక్కు వినియోగించుకున్నట్టు వేలిపై వేసిన సిరా గుర్తును చూపిస్తూ తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లి ఓటు వేసిన దృశ్యాలను చిత్రీకరించడంతో, పోలింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినప్పటికీ, వారి కళ్లు గప్పి మొబైల్‌ ఫోన్లు లోపలికి ఎలా వెళ్లాయన్న అనుమానాలను ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement