వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో తగ్గని ఆదరణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో తగ్గని ఆదరణ

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

● ఫలించని కూటమి నేతల జిమ్మిక్కులు ● నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌

జెడ్పీటీసీ అభ్యర్థి అంకంరెడ్డి సౌమ్యతో కలిసి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్‌

నాతవరం: కూటమి నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఆదరణ తగ్గలేదని నర్సీపట్నం మాజీ ఎమ్యెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ తెలిపారు. మండలంలో ఎం. బెన్నవరం, మర్రిపాలెం, నాతవరం, పెదగొలుగొండపేట, గునుపూడి, పి.కె.గూడెం, పి.జగ్గంపేట, శృంగవరం, వెదురుపల్లి, చమ్మచింత, తాండవ గ్రామాల్లో ఆయన గురువారం జెడ్పీటీసీ అభ్యర్థి అంకంరెడ్డి సౌమ్యతో కలిసి పోలింగ్‌ సరళిని స్వయంగా పరిశీలించారు. పార్టీ అభ్యర్థుల్లో మనోధైర్యాన్ని నింపారు. ప్రజలకు అండగా ఉంటూ అధిక శాతం ఓటింగ్‌ నమోదుకు ప్రోత్సహించాలని సూచించారు. కూటమి నేతలు ప్రలోభాలు పెట్టి తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేశారన్నారు. వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నియోజకవర్గంలో కూటమి నేతలకు దిమ్మతిరిగే విధంగా తమ అభ్యర్థులు పోటీ ఇచ్చారన్నారు. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కరక అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement