ప్రశాంత ఎన్నికలే లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం!

Nov 5 2026 12:28 AM | Updated on Nov 5 2026 12:28 AM

చింతపల్లి: చింతపల్లి డివిజన్‌ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక ఏఎస్పీ నిరంజన్‌ మహేందర్‌ సిన్హా తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారీగా చేపడుతున్న ఏర్పాట్ల వివరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రమణారావు, ఎంపీడీవో లాలం సీతయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డివిజన్‌ పరిధిలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ సింహాచలం, ఎస్‌ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట భద్రత : పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి

ముంచంగిపుట్టు: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పాడేరు డీఎస్పీ రాజాసింహారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌లను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి అక్కడి సదుపాయాలు, ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి ఎస్‌ఐ నాని, సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ సంజీవరావు, ఎంపీడీవో ధర్మారావు, తహసీల్దార్‌ త్రినాథనాయుడు పాల్గొన్నారు.

ఏఎస్పీ నిరంజన్‌ మహేందర్‌ సిన్హా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement