సీలేరు: ఏజెన్సీలోని ఆంధ్ర–ఒడిశా–పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని సీలేరు, దుప్పులవాడ, దారకొండ, అత్యంత మారుమూల గుమ్మిరేవుల ప్రాంతాలకు బుధవారం సాయంత్రం ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ యాసీన్ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్, పోలీసు బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. ఏఎస్పీ ఆదేశాలతో సీఐ సుధాకర్ పర్యవేక్షణలో బందోబస్తు చేపట్టారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా సంచరించవద్దని హెచ్చరించారు.
మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
గూడెంకొత్తవీధి మండలంలోని 16 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు వర్షాలు, రహదారి ఇబ్బందులు సవాలుగా మారాయి. సీలేరు మినహా మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ అనంతరం సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు సురక్షితంగా మండల కేంద్రానికి చేరేలా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్


