డీఆర్వోగా వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఆర్వోగా వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

Nov 5 2026 12:28 AM | Updated on Nov 5 2026 12:28 AM

పాడేరు రూరల్‌: నూతన రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన కలెక్టర్‌ టి.నిశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో రాజోలు తహసీల్దార్‌గా, మార్కాపురం, వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని కంభం యూనిట్‌లో ఎస్‌డీసీగా విధులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది నూతన డీఆర్వోకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, సహచర ఉద్యోగుల పట్ల సమన్యాయంతో వ్యవహరిస్తూ సమిష్టిగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement