ముంచంగిపుట్టు: మండలంలో మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో మండల కేంద్రంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. గిరిజన గ్రామాల్లో పలుచోట్ల వరి పంట పొలాలు నీట మునిగాయి. మట్టి దిబ్బలు కొట్టుకొచ్చి పొలాల్లో పేరుకుపోవడంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంగబయలు, బూసిపుట్టు పంచాయతీలకు వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. దీంతో వాహనాలు బురదలో కూరుకుపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముసురు వాతావరణం కారణంగా పలు గ్రామాల గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు.


