అయ్యన్న చేసిన అభివృద్ధి ఏదీ? | - | Sakshi
Sakshi News home page

అయ్యన్న చేసిన అభివృద్ధి ఏదీ?

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

ఆరిల్లోవ రోడ్డు అనుమతులు

తెచ్చుకోవడంలో విఫలం

నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు కూటమి బాకీ రూ.990 కోట్లు

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

గొలుగొండ: అలవిమాలిన హామీలిచ్చి ప్రజలకు మోసం చేయడమే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గాన్ని స్పీకరు అయ్యన్నపాత్రుడు అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ విమర్శించారు. మంగళవారం గొలుగొండలో ఆయన మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామని 2024 కూటమి గెలిచిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వల్ల నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు రూ. 990 కోట్లు ఉందన్నారు. పథకాల పేరుతో చంద్రబాబు సర్కార్‌ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. నర్సీపట్నం ప్రాంతాన్ని రూ. 276 కోట్లతో అభివృద్ధి చేశామని ఇటీవల టీడీపీ నాయకులు డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. 2024 ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.185 కోట్లు మంజూరు చేయించగా, రూ.109 కోట్లతో సగం అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. తమ ప్రభుత్వంలో మంజూరైన నిధులనూ కూటమి సర్కార్‌ ఖాతాలో వేసుకోవడం ప్రజలకు తెలుసునన్నారు. అక్రమంగా సంపాదించుకోవడం కోసం రూ.200 కోట్లతో ఎంపీ సీటు కొనుగోలు చేసుకున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ప్రజలకు బాకీ ఉన్న రూ. 990 కోట్లు తీసుకువచ్చి అప్పుడు ప్రగల్బాలు పలకాలన్నారు. గతంలో మంత్రి హోదాలో అయ్యన్న గొలుగొండ మండల ప్రజలకు అవసరమైన ఆరిల్లోవ రోడ్డు అనుమతులు తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హోదాలో తాను ఆరిల్లోవ రోడ్డు వేసి ప్రజల కష్టాలు తీర్చానన్నారు. వెన్నుపోటు పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం మండలాల్లో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కొరుప్రోలు పాణిశాంతారామ్‌, మాజీ జెడ్పీటీటీ సుర్ల గిరిబాబు, మాజీ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మాదాల ప్రవీణ్‌కుమార్‌, కసిపల్లి బుజ్జి, నాయకులు సత్యనారాయణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement