హామీలు ఎగ్గొట్టిన కూటమికి గుణపాఠం చెప్పండి | - | Sakshi
Sakshi News home page

హామీలు ఎగ్గొట్టిన కూటమికి గుణపాఠం చెప్పండి

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

● వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి ● మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

బుచ్చెయ్యపేట: ఎన్నికల హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన ఎంపీపీ దొండా రాంబాబు, జెడ్పీటీసీ అభ్యర్థి తరపున జోగా కొండబాబుతో పాటు రాజాం ఎంపీటీసీ అభ్యర్థి యన్నెంశెట్టి హైమావతి, పలు గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులకు మదతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్‌ ఇస్తామని, 18 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ. 1,500, నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఎవరికై నా ఇచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లలో కొత్తగా ఒక్క పింఛన్‌, ఇల్లు గాని ఇచ్చారా అని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానని, ధరలు తగ్గిస్తామని గొప్పలు చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు, కూటమి నేతలు ఇక్కడ మైనింగ్‌ను కొల్లగొట్టడమే కాక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అన్ని గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. మన జగనన్న ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు మీ ఇళ్లకే వస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement