బుచ్చెయ్యపేట: మండలంలో పోలేపల్లి తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు సీతా సన్యాసినాయుడు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సమక్షంలో మంగళవారం గ్రామానికి చెందిన 30 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీతా వరలక్ష్మి, కస్పా కాలువ నీటి సంఘం మాజీ డైరెక్టర్ సీతా గౌరీనాయుడు కుమారుడు సీతా శ్రీను, ముత్తా శ్రీను, సీతా పెంటయ్య, పిట్ల మాణిక్యం తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు. వీరందరికి అమర్‌నాథ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథ్‌ల నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారంతా తెలిపారు. ఎంపీపీ అభ్యర్థి దొండా రాంబాబు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు జోగా కొండబాబు తదితరులు పాల్గొన్నారు.


