ఘాట్‌రోడ్డులో అడవిదున్న హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌రోడ్డులో అడవిదున్న హల్‌చల్‌

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

కొయ్యూరు: చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో సోమవారం ఓ అడవిదున్న హల్‌చల్‌ చేసింది. రహదారిపై సంచరిస్తున్న అడవిదున్నను చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు దానిని చూసి అప్రమత్తమయ్యారు. సాధారణ గేదెలతో పోలిస్తే అడవిదున్న నుదుటిపై, కాళ్ల కింది భాగంలో తెల్లటి గుర్తులు ఉండటంతో దానిని సులభంగా గుర్తించారు. కొద్దిసేపు రోడ్డుపై సంచరించిన అడవిదున్న అనంతరం తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement