ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే విధానాన్ని రద్దు చేయడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల రేషన్ కోసం డిపోల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని చోట్ల డిపోలు సకాలంలో తెరవకపోవడంతో మొదటి వారంలోనే బియ్యం పొందడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో పంపిణీని పునరుద్ధరించాలి. లేనిపక్షంలో మారుమూల గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకు ని కొత్తగా డీఆర్ డిపోలను ఏర్పాటు చేయాలి.
–రంధి చిన్నయ్య, గిరిజన ప్రజా సంఘం నేత, గుత్తులపుట్టు


