బియ్యం కోసం గిరిజనుల బేజారు ఎండీయూ వాహనాల రద్దుతో కష్టాలు 3 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో రేషన్ డిపోలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి.. బియ్యం మోత కొన్ని డిపోలు తెరుచుకోక లబ్ధిదారుల ఎదురుచూపులు
పాడేరు పాతబస్టాండ్ వద్ద తెరుచుకోని ప్రధాన డీఆర్ డిపో
సాక్షి, పాడేరు: గిరిజనులకు రేషన్ బియ్యం అందుకోవడం కష్టంగా మారింది. గతంలో ఇంటి వద్దకే వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దు కావడంతో మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయి. ప్రతి నెల రేషన్ కోసం గ్రామాల నుంచి డిపోలకు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లడం.. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించడం.. బియ్యం తీసుకున్న అనంతరం వాటిని తిరిగి గ్రామాలకు మోసుకురావడం గిరిజనులకు భారంగా మారింది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు నెల ప్రారంభమై రెండు రోజులవుతున్నా పలు డీఆర్ డిపోలు తెరుచుకోకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెరుచుకున్న కొన్ని డిపోల వద్ద రద్దీతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా డిపోలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
ఒక్కో డిపో పరిధిలో 15 గ్రామాలు


