నర్సీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కోరారు. మండలంలోని లక్ష్మీపురంలో వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థి శానాపతి దుర్గ, పార్టీ మండలాధ్యక్షుడు శానపతి వెంకటరత్నంలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జెడ్పీటీసీ అభ్యర్థి బోళెం వెంకటేష్, ఎంపీటీసీ అభ్యర్థి దుర్గను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


