సెఫ్టిక్‌ ట్యాంకు గోతిలో పడి ఆవు మృతి | - | Sakshi
Sakshi News home page

సెఫ్టిక్‌ ట్యాంకు గోతిలో పడి ఆవు మృతి

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

మృతి చెందిన పాడి ఆవు

బుచ్చెయ్యపేట: మేజర్‌ పంచాయతీ వడ్డాదిలో సెఫ్టిక్‌ ట్యాంకు గోతిలో పడి పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన శనగల శ్రీనుకు చెందిన పాడి ఆవు సోమవారం పచ్చగడ్డి మేస్తుండగా, సెఫ్టిక్‌ ట్యాంక్‌ కోసం తవ్విన గోతిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. స్థానిక యువకులు తాళ్లు సహాయంతో గోతిలో నుంచి మృతి చెందిన ఆవును బయటకు తీశారు. రూ. 50 వేలు విలువ చేసే పాడి ఆవు మృతితో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే ప్రాంతంలో 20 మంది వరకు సెఫ్టిక్‌ ట్యాంక్‌ గోతులు తవ్వి వరలు వేసి రక్షణ మూతలు పెట్టకుండా వదిలేశారు. జీవాలు గోతుల్లో పడి మృతి చెందుతున్న పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్థానిక యువకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement