జగన్‌ అంటే నమ్మకం చంద్రబాబు అంటే అమ్మకం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ అంటే నమ్మకం చంద్రబాబు అంటే అమ్మకం

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

● ప్రభుత్వ మోసపూరిత హామీలు నమ్మి మోసపోకండి ● వడ్డాదిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రులు కన్నబాబు,అమర్‌నాథ్‌

బుచ్చెయ్యపేట : కూటమి ప్రభుత్వం చెబుతున్న మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌లు కోరారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రం వడ్డాది వచ్చారు. ఎంపీపీ అభ్యర్థి దొండా రాంబాబు, జెడ్పీటీసీ అభ్యర్థి జోగా వరలక్ష్మితో పాటు మండలంలో ఉన్న 19 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్‌ అంటే ప్రజలకు నమ్మకం అని.. ఇచ్చిన మాట నిలబెట్టకోవడంలో జగన్‌ ముందుంటారన్నారు. గత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన హామీలన్ని నెరవేర్చడమే కాక ఇవ్వని హామీలను అమలు చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్‌లైనా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చకుండా అన్ని రంగాల ప్రజల్ని మోసం చేశారన్నారు. అందుకే ప్రజలకు జగన్‌ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అని తెలిసిపోయిందన్నారు. ఎన్నికల్లో సంపద సృస్టిస్తానని, ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు సంపదలు తరలిపోగా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. కొత్తగా ఒక్క పింఛన్‌ గాని,ఇల్లు గాని మంజూరు చేశారా అని ప్రశ్నించారు. జగనన్న ఇచ్చిన పింఛన్లు, ఇళ్లు తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని స్ధానిక ఎన్నికల్లో ప్రజలు చూపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి నేతలకు స్ధానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. వడ్డాది–1 పోటీ అభ్యర్ధి నాలం మంగ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రులు కన్నబాబు, అమర్‌నాఽథ్‌తో కలసి ప్రచారం నిర్వహిస్తూ బజ్జీ కొట్టు వద్ద బజ్జీలు వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, ఎంపీటీసీ పోటీ అభ్యర్థి దొండా నారాయణమూర్తి, నాయకులు కోవెల జనర్ధనరావు, అడపా శ్రీను, గుమ్మిడి ప్రసాద్‌, సయ్యపురెడ్డి కొండబాబు, కోరుకొండ రమణ, బి. వరలక్ష్మి, శంకర్రావు, మనోహర్‌, కేబుల్‌ ప్రసాద్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement