సాక్షి, పాడేరు: ఈ నెల 5 స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన ఐసీటీసీ వాహనంపై సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన ప్రచార స్టిక్కర్లను కారు చుట్టూ అతికించారు. ఈ వాహనం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నప్పటికీ వాటిని తొలగించలేదు. అలాగే చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలతో కూడిన ప్రచార పోస్టర్లు సైతం కనిపిస్తున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వీటిని అధికారులు ఎందుకు తొలగించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాలకు ఎన్నికల కోడ్ వర్తించదా అని జిల్లా ఎన్నికల విభాగాన్ని నిలదీస్తున్నారు.


