దేవరాపల్లి: మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. నా ఓటు కొనే శ్రీమంతుడు లేడు.. ఓట్లు అమ్ముకునే దరిద్రంలో నేను లేను.. డాక్టరు బీఆర్ అంబేడ్కర్ మనకు ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన ఆయు ధం ఓటు హక్కు మాత్రమే...అంటూ యువకుడు తన ఇంటికి బ్యానర్ కట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. దేవరాపల్లిలో కర్రి సన్యాశినాయుడు తన ఇంటికి దీన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆలోచింపజేస్తున్నాడు. ఎన్నికలు వస్తే చాలు ఓటర్లను ప్రలోభాలకు పెట్టేందుకు రాజకీయ పార్టీలు నానా ప్రయత్నాలు చేస్తాయి. ఈ నిరుపేద యువకుడి మాదిరిగా అందరూ ఆలోచించి ప్రజాస్వామ్య దేశంలో ప్రలోభాలకు లొంగకుండా వజ్రాయుధం లాంటి ఓటు హక్కుతో మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆలోచింపచేస్తున్న దేవరాపల్లిలో యువకుడు వినూత్న ప్రచారం


