జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు | - | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

అచ్యుతాపురం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అచ్యుతాపురం మండలంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఉప్పవరం గ్రామానికి చెందిన మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌, జనసేన నాయకుడు చందక శివ, చందక తిరుమల రావు తమ అనుచరులు సుమారు 20 మందితో కలిసి వైఎస్‌ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్రరాజు, ఎంపీటీసీ అభ్యర్థి చందక శ్రీనువాసరావు, బుధిరెడ్డి భాస్కర్‌, బోజా నూకేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement