పట్టుకున్న మద్యం బాటిళ్లతో ఎస్ఐ మనోజ్‌కుమార్
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేటలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ పి.మనోజ్‌కుమార్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీతా అప్పలనాయుడు ఇంటి వద్ద మద్యం నిల్వ చేసినట్టు సమాచారం అందడంతో శనివారం రాత్రి తమ సిబ్బందితో దాడి చేశామన్నారు. 48 మద్యం బాటిళ్లతో పాటు నిల్వ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా బెల్టు షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం నిల్వ చేసినా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


