గొలుగొండ : అల్లూరి జిల్లా ఏజెన్సీ నుంచి మైదానం ప్రాంతం అయిన కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కారులో 8 కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని ఎస్‌ఐ రుషికేశ్వరరావు తెలిపారు. ఏజెన్సీ నుంచి కారులో గంజాయి తరలిస్తున్న సమయంలో శనివారం ఉదయం అల్లూరి పార్కు వద్ద వాహన తనిఖీలు నిర్వహించే సమయంలో ఒంగోలు ప్రాంతానికి చెందని షోయిక్, బోజి అనే ఇద్దరు వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఇద్దరిని కోర్టుకు తరలించి కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కృష్ణదేవిపేట పోలీసులు పాల్గొన్నారన్నారు.


