పాముకాటు బాధితుడికి సత్వర వైద్యం | - | Sakshi
Sakshi News home page

పాముకాటు బాధితుడికి సత్వర వైద్యం

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

ప్రాణాలు కాపాడిన వైద్యాధికారి బాబ్జి, సిబ్బంది

సీలేరు: ఏజెన్సీలో తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి బాధితుడిని కాపాడిన ఘటన గూడెంకొత్తవీధి మండలంలో చోటుచేసుకుంది. గుమ్మరేవులు పంచాయతీ బూసుమానుగూడ గ్రామానికి చెందిన అయ్యప్ప అనే యువకుడు బుధవారం పొలానికి వెళ్లిన సమయంలో పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు దారకొండ పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారం అందించారు., భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంబులెన్స్‌లో సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. మండలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో.. చీకటిలోనే సెల్‌ఫోన్‌ వెలుతురులో డాక్టర్‌ బాబ్జీ ఆ యువకుడికి ప్రాణాలను నిలిపేలా అత్యవసర వైద్యం అందించారు. ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం చింతపల్లికి తరలిస్తామని వైద్యులు తెలిపారు. విధి నిర్వహణలో వైద్య సిబ్బంది చూపిన అంకితభావంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement