భస్మ సహిత చందన అలంకరణలో స్వయంభువు | - | Sakshi
Sakshi News home page

భస్మ సహిత చందన అలంకరణలో స్వయంభువు

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

చోడవరం: చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో భస్మ సహిత చందన అలంకరణలో కార్యసిద్ధి గణపతిస్వామి భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు. వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో స్వయంభూ విఘ్నేశ్వరస్వామి దర్శన మిస్తున్నారు. 8వ రోజు స్వామివారు భస్మ సహిత చందన అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామివారిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాఽథ్‌ దర్శించుకున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక కుంకుమార్చన, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సా యంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పీఎస్‌పేటలో శ్రీ లక్ష్మీగణపతి స్వామివారి ని అమర్‌నాథ్‌ దర్శించుకున్నారు. అక్కడ ఆలయ కమిటీ చైర్మన్‌ పుట్రేవు శ్యామ్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో వేదపండితులు అమర్‌నాఽథ్‌కు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement