కొయ్యూరు: పాడేరులో ఈనెల 18న నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ సైన్స్ సెమినార్‌లో కొయ్యూరు గురుకుల పాఠశాల విద్యార్థి జి.దేశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న దేశ్వంత్.. పాడేరు డీఈఓ భానుమూర్తి రాజు ఆధ్వర్యంలో భారత ఆహార భద్రత (2047) అనే అంశంపై నిర్వహించిన ఈ సెమినార్‌లో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా సెమినార్ నిర్వాహకులు దేశ్వంత్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యార్థి ప్రతిభను ప్రశంసిస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహమూర్తి, ఎంఈఓ సింహచలం మరియు ఉపాధ్యాయులు అతడిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే విధమైన ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


