● ‘సీలేరు’ పరిధిలో రెండేళ్లుగా470 మంది ఎదురుచూపు
సీలేరు: కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ సీలేరుకు చెందిన పలువురు అధికారులను వేడుకుంటున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో ప్రస్తుత ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చూపడం వల్ల విద్యార్థులు మెరుగైన చదువులకు, ఉద్యోగాలకు దూరమైపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సీలేరు గ్రామ సచివాలయం పరిధిలో 470 మంది విద్యార్థులు ఇప్పటివరకు కుల ధ్రువీకరణ పత్రాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. ధ్రువపత్రాలకోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


