● కలెక్టర్ నిశాంతి
పాఠశాలలకు అవార్డులు అందజేస్తున్న కలెక్టర్ నిశాంతి
పాడేరు రూరల్: స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డులు ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు మరింత గుర్తింపు తెస్తాయని జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. శనివారం తలారిసింగి బాలుర పాఠశాల ఆవరణలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ... అవార్డులకు ఎంపికై న ఐదు పాఠశాలలకు మరింత ప్రోత్సాహం, ప్రత్యేక గుర్తింపు లభిస్తాయని చెప్పారు. మొదటి స్థానం 95 మార్కులతో అరకులోయ క్రీడా పాఠశాల, రెండో స్థానం 71 మార్కులతో గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, గుత్తులపుట్టు (పాడేరు), మూడో స్థానం 33 మార్కులతో బాలుర పాఠశాల, తలారిసింగి (పాడేరు), నాల్గో స్థానం 26 మార్కులతో గిరిజన సంక్షేమ పాఠశాల, బాకురు (హుకుంపేట), ఐదో స్థానం: 25 మార్కులతో గిరిజన సంక్షేమ పాఠశాల, నుర్మతి (జి.మాడుగుల) సాధించాయి. అనంతరం ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఆమె బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రెటరీ పాంగి సూరిబాబు, పీడీలు భూపతిరాజు, సింహచలం, మన్మథరావు, శివప్రసాద్, మురళి, కృష్ణకుమారి, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.


