● నేడు చౌడుపల్లిలో ప్రారంభం ● ఏర్పాట్లు పూర్తి
చౌడుపల్లిలో రప్రారంభానికి
సిద్ధం చేసిన గ్రంథాలయ భవనం
చింతపల్లి: చౌడుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనాన్ని నేడు ప్రారంభించనున్నారు. స్థానిక యువత, గ్రామస్తుల సహకారంతో పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని పాత పంచాయతీ భవనంతో పాటు నిరుపయోగంగా ఉన్న డీఆర్‌డీఏ భవనాన్ని విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. ఈ గ్రంథాలయానికి అవసరమైన అన్ని సౌకర్యాలను గ్రామస్తుల సహకారంతో సమకూర్చారు. గ్రామ పెద్దల సమక్షంలో నేడు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలోని విద్యార్థులు, యువత, ఉద్యోగులందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని గ్రంథాలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.


