● రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం
మొదటి స్థానం సాధించిన సీలేరు విద్యార్థిని దాక్షిత
సీలేరు: మారుమూల ప్రాంతాల్లో చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించగలమని సీలేరు విద్యార్థులు మరోసారి నిరూపించారు. మైదాన ప్రాంత క్రీడాకారులతో పోటీపడి మొదటి స్థానాలు సాధిస్తూ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తున్నారు.
ఇందులో భాగంగానే రాజాంలో జరిగిన అండర్–14 బాలికల విభాగం షాట్‌పుట్ పోటీల్లో సీలేరు ఏపీ జెన్‌కో డీఏవీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బి. దాక్షిత ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల పీఈటీ కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఘనత సాధించిన విద్యార్థిని దాక్షితను, పీఈటీ కమలాకర్‌ను పాఠశాల ఎల్‌ఎంసీ చైర్మన్, జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, లీగల్ ఆఫీసర్ ప్రసాద్, ప్రిన్సిపల్ బి. నాగేంద్ర అభినందించారు.


