రానున్న ఐదు రోజుల్లోతేలికపాటి వర్షాలు | - | Sakshi
Sakshi News home page

రానున్న ఐదు రోజుల్లోతేలికపాటి వర్షాలు

Aug 22 2026 1:17 AM | Updated on Aug 22 2026 1:17 AM

8లో

న్యూస్‌రీల్‌

26 వ తేదీ వరకూ తేలిక పాటి వర్షాలు

చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురి సే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం అసో సియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ మరియు వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ డి. ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 22 నుండి 26 వరకు అల్లూరి జిల్లా పరిధిలోని వాతావరణ వివరాలను ఆమె వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 2.7 నుండి 5.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 27.9 డిగ్రీల నుండి 28.8 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీల నుండి 22.3 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 82 నుండి 84 శాతం, మధ్యాహ్న సమయాల్లో 80 నుండి 87 శాతం మధ్య ఉంటుందన్నారు. గాలి గంటకు 6 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలున్నాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్‌ సూచించారు.

షిప్‌.. షిప్‌.. హుర్రే!

హిందూస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) తన సుదీర్ఘ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది.

శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026

ముంచంగిపుట్టు: ప్రభుత్వం కొత్త ఇళ్లు మంజూరు చేసిందన్న ఆనందంతో ఉన్న ఇళ్లను తొలగించి.. కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పీవీటీజీ గిరిజనులకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. గృహ నిర్మాణం వివిధ దశల్లో ఉన్నప్పటికీ సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నెలల తరబడి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న గిరిజన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనుల కోసం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం–జన్‌మన్‌) పథకం కింద 28,691 పక్కా ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 6,693 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

● ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.39 లక్షలు కేటాయించింది. తొలి విడతగా పునాది స్థాయి నిర్మాణానికి రూ.70 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ తర్వాత లింటల్‌ స్థాయి వరకు నిర్మాణం పూర్తయితే రూ.90 వేలు, పైకప్పు నిర్మాణం పూర్తయితే రూ.40 వేలు చెల్లించాల్సి ఉంది. మరో రూ.27 వేలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే అదనంగా రూ.12 వేలు మంజూరు చేయాల్సి ఉంది.

మూడు నెలలుగా

రూ.కోట్లలో పైగా బకాయిలు

జిల్లాలో నిర్మాణంలో ఉన్న గృహాలకు గత మూడు నెలలుగా నిధులు విడుదల కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సుమారు రూ.6 కోట్లకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 21,998 గృహాలకు బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ముఖ్యంగా ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో బిల్లుల బకాయిలు అధికంగా ఉన్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. రూఫ్‌ లెవల్‌ దశ వరకు నిర్మాణం పూర్తయిన 12,027 గృహాలకు కూడా బిల్లులు అందాల్సి ఉంది.

ఆందోళన చేసినా స్పందన కరువు : గృహ నిర్మాణ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త ఇల్లు మంజూరైందన్న ఆనందంతో పాత ఇళ్లను కూల్చుకున్న పీవీటీజీ గిరిజనులకు ఇప్పుడు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో గత మూడు నెలలుగా సుమారు రూ.6 కోట్లకు పైగా గృహ నిర్మాణ బకాయిలు నిలిచిపోవడంతో వేలాది ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాత్కాలిక పాకల్లో చిన్నారులతో జీవిస్తూ లబ్ధిదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement